హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంబేడ్కర్ విగ్రహానికి ముసుగుపై వివాదం

ELR: భీమడోలు మండలం పొలసానిపల్లి గ్రామంలో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహానికి ఎన్నికల కోడ్ నేపథ్యంలో ముసుగు వేయడం వివాదానికి దారితీసింది. పంచాయతీ సిబ్బంది రాజకీయ నాయకుల విగ్రహాలు, ఫ్లెక్సీలతో పాటు అంబేడ్కర్ విగ్రహానికి ముసుగు వేయడంతో గ్రామస్థులు, అంబేడ్కర్ వాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరపాటును గుర్తించిన అధికారులు విగ్రహానికి ముసుగును తొలగించారు.