హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు'

AKP: జీవీఎంసీ అనకాపల్లి జోన్‌లో ఎన్నికల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు చేశామని జోనల్ కమిషనర్ కె.చక్రవర్తి తెలిపారు. మొత్తం 89 పోలింగ్ కేంద్రాల్లో 32 సమస్యాత్మకమైనవి, 20 అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్ నిర్వహణకు 586 మంది సిబ్బందిని నియమించామన్నారు.