BPT: చీరాల జాతీయ రహదారిపై ఎన్నికల నేపథ్యంలో రెండో పట్టణ సీఐ శశికుమార్ ప్రజలకు అవగాహన కల్పించారు. ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని, ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించడం చట్టరీత్యా నేరమని తెలిపారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల నియమావళిపై ప్రజలకు అవగాహన.


