హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎటువంటి ఘర్షణలకు తావివ్వద్దు: భీమవరం DSP

WG: ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల్లో ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో పాల్గొనాలని భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు సూచించారు. శుక్రవారం రాత్రి సీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. నామినేషన్ల ప్రక్రియ నుంచి ఎన్నికలు ముగిసే వరకు సంయమనం పాటించాలని కోరారు. ఘర్షణలకు తావిచ్చేలా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ కాళీ చరణ్, ఎస్ఐ శుభశేఖర్ పాల్గొన్నారు