హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వశిష్ఠ గోదావరి కాలుష్యమవుతోంది: మత్స్యకారులు

WG: నరసాపురంలో వశిష్ఠ గోదావరి కాలుష్యంపై CPM ఆధ్వర్యంలో మత్స్యకారులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఆక్వా పరిశ్రమల రసాయన వ్యర్థాల వల్ల చేపలు మృత్యువాత పడుతున్నాయని, మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్య నియంత్రణ అధికారులు తక్షణమే పరిశ్రమలను తనిఖీ చేసి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.