హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసాపురంలో తొలిరోజు ఐదు నామినేషన్లు

WG: నరసాపురం మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ఐదు నామినేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు. మున్సిపల్ ఛైర్పర్సన్ అభ్యర్థిగా వైసీపీ తరఫున కావలి రామసీత నామినేషన్ దాఖలు చేశారన్నారు. మరోవైపు 36 వార్డులకు నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్టు పేర్కొన్నారు. బళ్ళ వెంకటేశ్వరరావు, పంజా దినేశ్, కావలి నాని, షేక్ యాకుబ్ బీబీ నామినేషన్లు వేసిన వారిలో ఉన్నారు.