హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ టీడీపీ మేయర్ అభ్యర్థిగా ముక్క శ్రావణి

VSP: జీవీఎంసీ మేయర్ అభ్యర్థిగా టీడీపీ మాజీ కార్పొరేటర్ ముక్క శ్రావణిని పార్టీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించింది. టీడీపీ తరఫున మేయర్ అభ్యర్థిగా శ్రావణి పేరును ఖరారు చేసింది. కాపు సామాజిక వర్గానికి చెందిన ముక్కా శ్రావణి 2021లో 26వ వార్డు నుంచి తొలిసారి పోటీ చేసి కార్పొరేటర్‌గా విజయం సాధించారు. ఆమె మాజీ కార్పొరేటర్,టీడీపీ నేత ముక్క మహాలక్ష్మినాయుడు కుమార్తె.