హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి రైతులతో సమావేశం

GNTR: అమరావతి నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చిన రైతుల రిటర్నబుల్ ప్లాట్ల ఎఫ్ఎస్ఐపై శనివారం నుంచి సీఆర్డీఏ కార్యాలయంలో రైతులతో సమావేశం నిర్వహించనున్నట్లు సీఆర్డీఏ అధికారులు తెలిపారు. ఎఫ్ఎస్ఐ పెంపుపై చర్చించి రైతుల అభిప్రాయాలను సేకరించనున్నట్లు పేర్కొన్నారు. రైతుల సూచనల మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటామని, రైతులు హాజరుకావాలని కోరారు.