హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

GNTR: తాడేపల్లిలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని డీఈఈ (ఆపరేషన్స్) కె.అనిల్ కుమార్ తెలిపారు. ట్రాన్స్ ఫార్మర్లు, తీగల మరమ్మతుల నిమిత్తం విజయవాడ క్లబ్ రోడ్డులో సత్య గార్డెన్స్ నుంచి గుర్రపుశాల వరకు, జాతీయ రహదారి ప్రాంతంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరఫరాలో అంతరాయం కలుగుతుందన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.