హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కదిరి 14వ వార్డులో టీడీపీకి షాక్!

SS: కదిరి పట్టణంలోని 14వ వార్డులో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ కౌన్సిలర్ ఎన్. సమీవుల్లా, యువ నాయకుడు ఎన్. అవైజ్ ఖర్నీ ఆధ్వర్యంలో 100 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరాయి. నియోజకవర్గ సమన్వయకర్త బి.ఎస్. మక్బూల్, మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషా వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.