హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్యాపిలిలో పోలీస్ కౌన్సెలింగ్

NDL: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున గ్రామాల్లో ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్యాపిలి ఎస్సై నాగార్జున హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పాత నేరస్తులకు పోలీసులు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించబోమని ఎస్సై స్పష్టం చేశారు.