హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుదాఘాతంతో వ్యక్తి దుర్మరణం

VZM: జామి మండలం జి.సింగవరంకు చెందిన మద్దిల రమణ(33) విద్యుదాఘాతంతో మృతిచెందాడు. దేవాడలో శుక్రవారం రాడ్ బెండింగ్ పనులు చేస్తుండగా ప్రమాదం జరిగింది. వెంటనే పీఎం పేట పీహెచ్సీకి తరలించారు. కొత్తవలస తీసుకెళ్తుండగా మృతిచెందాడు. రమణకు వివాహం కాలేదు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.