హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ మృతి

PPM: రాజవొమ్మంగి మండలం జడ్డంగి శివారులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ మన్మథరావు(52) మృతిచెందారు. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం పాలమెట్టకు చెందిన ఆయన జడ్డంగిలో విధులు నిర్వహిస్తున్నారు. చెరుకుంపాలెం నుంచి ద్విచక్ర వాహనంపై వస్తుండగా కారు ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో కాకినాడ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారని పోలీసులు తెలిపారు.