హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కనిగిరిలో BNSS సెక్షన్ 163 అమలు

ప్రకాశం: కనిగిరి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని 32 వార్డుల పరిధిలో ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు 163 బీఎన్ఎస్ఎస్ సెక్షన్ అమలు చేస్తున్నట్లు తహసీల్దార్ కృష్ణప్రసాద్ తెలిపారు. నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడరాదని, మారణాయుధాలు, కర్రలు,పేలుడు పదార్థాలతో సంచరించరాదని ఆదేశించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.