హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

VSP: పరవాడ మండలంలో విద్యుత్ నిర్వహణ పనుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు ఏపీఈపీడీసీఎల్ ఈఈ మురళీకృష్ణ తెలిపారు. రావాడ, ధర్మారాయుడు పేట, రేఖవానిపాలెం, దేశపాత్రునిపాలెం గ్రామాల్లో సరఫరా నిలిచిపోతుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.