హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీ మిథున్ పై దాడిని ఖండించిన ఎమ్మెల్యే

KRNL: చిత్తూరు జిల్లా పుంగనూరులో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై జరిగిన దాడిని మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఖండించారు. ప్రజల చేత ఎన్నికైన ఎంపీపై నామినేషన్ల సమయంలో దాడి చేయడం దుర్మార్గమని అన్నారు. ఎన్నికలు రాజ్యాంగబద్ధంగా, ప్రశాంతంగా జరగాలని, ప్రతిపక్ష నేతలపై దాడులు శాంతిభద్రతల వైఫల్యాన్ని సూచిస్తున్నాయని పేర్కొన్నారు.