హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మెట్లపై నుంచి జారిపడి వ్యక్తి మృతి

VSP: భీమునిపట్నంలో భవనానికి రంగులు వేస్తుండగా నిన్న సాయంత్రం ప్రమాదం చోటు చేసుకుంది. నగరం నుంచి వచ్చిన నలుగురు పెయింటర్లలో మర్రిపాలేనికి చెందిన నడుపూరి సోమేశ్వరరావు (36) మెట్లపై నుంచి జారిపడి తలకు తీవ్రగాయమై మృతి చెందాడని సీఐ దివాకర్ యాదవ్ తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.