హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కన్యకా పరమేశ్వరి ఆలయాల్లో మంత్రి పూజలు

NDL: అవుకు, కోయిలకుంట్లలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయాల్లో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శుక్రవారం రాత్రి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మంత్రి ప్రార్థించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.