AP: శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలోని గొల్లపల్లి రిజర్వాయర్లో పడి ఐదుగురు మహిళలు మృతి చెందడంపై మాజీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపి, ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కోరారు. కాగా, విహారయాత్రకు వెళ్లిన వీరు ఈత కొట్టేందుకు దిగి నీట మునిగి ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా విషాదం నింపింది.
వార్తలు
గొల్లపల్లి ఘటనపై జగన్ దిగ్భ్రాంతి


