హైదరాబాద్: 28°C
వార్తలు

గొల్లపల్లి రిజర్వాయర్ ఘటనపై పవన్ ఆరా

AP: గొల్లపల్లి రిజర్వాయర్‌ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ ఆరా తీశారు. ఐదుగురు మహిళల మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, కలెక్టర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు సమీక్షించాలని, రిజర్వాయర్లు, లోతైన ప్రాంతాల్లో గజఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.