హైదరాబాద్: 28°C
వార్తలు

రాయచోటిలో డీఐజీ కోయ ప్రవీణ్ పర్యటన

AP: అన్నమయ్య జిల్లా రాయచోటిలో డీఐజీ కోయ ప్రవీణ్ పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. భద్రతా చర్యల్లో భాగంగా రాయచోటిలో రెండ్రోజుల పాటు ఊరేగింపులపై నిషేధం విధించారు. నామినేషన్ వేయాలనుకునే అభ్యర్థులకు ప్రత్యేక భద్రత కల్పిస్తామని స్పష్టం చేశారు. ఘటనకు బాధ్యులైన ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి, సీసీటీవీ పుటేజీ ఆధారంగా నిందితులను గుర్తిస్తామని హెచ్చరించారు.