TPT: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం శిలాతోరణం వరకు భక్తులు వేచియున్నారు. స్వామివారి సర్వదర్శనానికి 18-20 గంటల సమయం పడుతోంది. రూ.300 శీఘ్రదర్శనానికి 3-5 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీనివాసుడిని 72,337 మంది భక్తులు దర్శించుకోగా.. 33,548 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీకి రూ.3.87 కోట్ల ఆదాయం వచ్చిందని TTD తెలిపింది.
ఆంధ్రప్రదేశ్
నేటి తిరుమల సమాచారం(శుక్రవారం)


