బాపట్ల జిల్లా చందోలు గ్రామంలోని శ్రీ బగళాముఖి అమ్మవారి దేవస్థానంలో శరత్కాల షోడశ యజ్ఞమహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజైన శుక్రవారం శ్రీ అమ్మవారు శ్రీ సరస్వతి మహాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. చదువుల తల్లి శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని సకల శుభాలు పొందాలని ఆలయ కార్యనిర్వహణాధికారి కోరారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీ సరస్వతి మహాదేవిగా బగళాముఖి అమ్మవారు


