ATP: విడపనకల్లు మండలం పెంచలపాడు వద్ద 67వ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఉన్న మట్టి దిమ్మెను ఢీకొని ద్విచక్ర వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో హరికృష్ణ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతనిని 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
మట్టి దిమ్మెను ఢీకొని బైక్ బోల్తా


