హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నవరాత్రుల వేళ వికసించిన బ్రహ్మకమలాలు

అన్నమయ్య: పెద్దమండ్యంలోని శ్రీ పరమేశ్వర నిలయం ఆవరణలో నవరాత్రుల పవిత్ర వేళ అరుదైన బ్రహ్మకమలం పుష్పాలు కనువిందు చేశాయి. రాత్రి సమయంలో వికసించే ఈ దివ్య పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే విశేష ఫలితం ఉంటుందని భక్తుల నమ్మకం. పర్వదినాల సమయంలో బ్రహ్మకమలాలు పూయడం ఎంతో శుభప్రదమని భక్తుల విశ్వాసం. ఇంటి సమీపంలోని రహదారిపై వెళ్లేవారు ఆసక్తిగా తిలకించారు.