GNTR: మాచర్ల మండలం విజయపురి సౌత్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎయిర్పోర్ట్ రహదారిపై బుధవారం కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన 8 మంది కూలీలు గాయపడ్డారు. చింతలతండాలో పత్తి తీసి తిరిగి వెళ్తుండగా ఘటన జరిగింది. క్షతగాత్రులను నాగార్జునసాగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
మాచర్లలో ఆటో బోల్తా.. కూలీలకు గాయాలు


