హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృష్ణా జిల్లా పరిషత్ సీఈవో బదిలీ

కృష్ణా జిల్లా పరిషత్ సీఈవో అరుణ బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో మామిడి శ్రీహరిరావు నియమితులయ్యారు. ఈయన APSIRDPR డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేస్తూ బదిలీపై వస్తున్నారు. గతంలో జిల్లా పంచాయతీ అధికారిణిగా బాధ్యతలు నిర్వర్తించిన అరుణ ఇటీవలే జడ్పీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. పలువురు జడ్పీ సీఈవోల బదిలీల్లో భాగంగా ఆమెను బదిలీ చేశారు.