W.G: నిత్యావసర సరకులను తక్కువ ధరలకు అందించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న 'మీ మార్ట్'లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని DSO సరోజని సూచించారు. గరగపర్రులోని రేషన్ దుకాణంలో ఏర్పాటు చేసిన మీ మార్ట్ను ఆమె ప్రారంభించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే సరకులు విక్రయించాలని డీలర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో ASO రవిశంకర్, MRO లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గ్రామాల్లో 'మీ మార్ట్' సేవలు: DSO


