హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజంపేట మున్సిపల్ బరిలో పసుపులేటి మంజుల

అన్నమయ్య: రాజంపేట మున్సిపల్ ఛైర్మన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో పసుపులేటి మంజుల పేరు రాజకీయ వర్గాల్లో తెరపైకి వచ్చింది. కూటమి నాయకత్వం తనకు అవకాశం కల్పిస్తే ఛైర్మన్ పదవికి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమె తెలిపారు. ప్రజాసేవే ప్రధాన లక్ష్యంగా, రాజంపేట పట్టణ అభివృద్ధికి కృషి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నానని పేర్కొన్నారు.