హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కొండల నడుమ మంచు సంద్రం

ASR: డుంబ్రిగూడ మండలంలోని కోసంగి పనసపుట్టు పరిసరాల్లో ప్రకృతి అందాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. ఉదయాన్నే కొండల మధ్య దట్టంగా పరుచుకున్న తెల్లని పొగమంచు సముద్రాన్ని తలపిస్తోంది. మంచు తెరల మధ్య నుంచి కనిపిస్తున్న కొండలు, పచ్చని ప్రకృతి దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. ఆహ్లాదకరమైన ఈ దృశ్యాలు మన్యం ప్రకృతి అందాలకు అద్దం పడుతున్నాయి.