హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారి దర్శనం

PLD: శరన్నవరాత్రుల్లో భాగంగా రొంపిచర్ల శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో 5వ రోజు అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు వేములరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఈ రోజు సాయంత్రం 102 మంది కన్యలు, ముత్తైదువులతో సామూహిక కుంకుమార్చనలు జరగనున్నాయి అని ధర్మకర్త మద్ది రామచంద్రరావు తెలియజేశారు.