NDL: మహానంది ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న మణివర్ధన్ తిరుపతిలో నిర్వహించిన 70వ జాతీయస్థాయి అండర్-19 జూడో పోటీల్లో కాంస్య పతకం సాధించాడు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు సత్యాలు, వ్యాయామ ఉపాధ్యాయుడు మహబూబ్ బాషా విద్యార్థిని అభినందించారు. జాతీయస్థాయిలో ప్రతిభ చాటడంపై హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
జాతీయ జూడో పోటీల్లో మణివర్ధన్కు కాంస్యం


