హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరు జిల్లాలో ఎన్నికలు.. కలెక్టర్ కీలక ఆదేశాలు

చిత్తూరు జిల్లావ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. రాజకీయ ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లను తొలగించాలని, అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల సంఘం అనుమతి లేకుండా కొత్త అభివృద్ధి పనులు ప్రారంభించరాదని స్పష్టం చేశారు.