హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అడ్డూ అదుపూ లేని అక్రమ తవ్వకాలు

NLR: సర్వేపల్లిలో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు, రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఎండిపోయిన ఇడిమేపల్లి చెరువులో లక్ష క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ తవ్వకాలకు అనుమతుల కోసం ఒత్తిడి తెస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులకు నష్టం కలగకుండా చెరువును కాపాడాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.