VSP: సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఇవాళ ఉదయం 108 సూర్యనమస్కారాల మహాయజ్ఞం అత్యంత వైభవంగా సాగింది. ఈవో జల్లేపల్లి వెంకట్రావు ఆదేశాలతో రాజగోపురం ప్రాంగణంలో ఈ సామూహిక యోగా సాధన చేపట్టారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 300 మందికి పైగా సాధకులు, భక్తులు క్రమశిక్షణతో 108 సూర్యనమస్కారాలు ఆచరించారు.
ఆంధ్రప్రదేశ్
వైభవంగా 108 సూర్యనమస్కారాల మహాయజ్ఞం


