హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సెలవు రోజుల్లో కొనసాగుతున్న రిలే దీక్షలు

ATP: సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ గుత్తి మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు చేపట్టిన సామూహిక నిరాహార దీక్షలు ఆదివారం 26వ రోజుకు చేరాయి. వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ, వివిధ రూపాల్లో నిరసనలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.