హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బార్ అండ్ రెస్టారెంట్‌లో చోరీ

BPT: పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న ఈగలు బార్ అండ్ రెస్టారెంట్‌లో దొంగతనం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు చొరబడి ఈ చోరీకి పాల్పడ్డారు. ఉదయం యాజమాన్యం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. ఎంత మేర ఆస్తి నష్టం జరిగిందన్న పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.