హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యువకుడి అనుమానాస్పద మృతి

తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వెనుక భాగంలో ఓ యువకుడి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. మృతుడిని ఓజిలి మండలం కారూరు గ్రామానికి చెందిన రుద్రపాక బాల గోవిందు (28)గా గుర్తించారు. యువకుడిని బండరాయితో కొట్టి హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గతంలోనే ఈ వ్యవహారంపై ఓజిలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సీఐ తెలిపారు.