NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా విజయవాడ వన్‌టౌన్ పోలీసులు కనకదుర్గమ్మకు తొలి సారె సమర్పించారు. నగర పోలీసు కమిషనర్ రాజశేఖరబాబు దంపతులు, ఇతర అధికారులు వన్‌టౌన్ పోలీసు ప్రాంగణం వద్ద పూజలు నిర్వహించి, మంగళ వాయిద్యాలతో సారెను ఇంద్రకీలాద్రికి తీసుకెళ్లారు. దుర్గమ్మను ఆడపడుచుగా భావించడం తరతరాల ఆచారం.
ఆంధ్రప్రదేశ్
కనకదుర్గమ్మకు తొలి సారె..!


