హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాడరేవు హైవేపై కారు ప్రమాదం

BPT: వాడరేవు- పిడుగురాళ్ల జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. పర్చూరు నుంచి చీరాల వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి రాయిని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హైవే అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.