హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీనివాస్

VZM: రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇవాళ జామి మండలం శాసనాపల్లి-పెదవేమలి గ్రామాల మధ్య వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కొన్ని దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వంతెన నిర్మాణానికి అడుగులు పడటంతో గ్రామస్థులు మేళతాళాలు, టపాసుల మోతల మధ్య పూర్ణకుంభంతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తమ చిరకాల కల నెరవేర్చినందుకు CM, DCMకు కృతజ్ఞతలు తెలిపారు.