హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గురుకుల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి'

GNTR: గురుకుల విద్యాలయాల ఉద్యోగుల సమస్యలను ప్రత్యేక దృష్టితో పరిశీలించి పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఏపీ జేఏసీ ఛైర్మన్ ఎ.విద్యాసాగర్ అన్నారు. వీరి న్యాయమైన డిమాండ్లకు ఏపీ ఎన్జీవో సంఘం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. గుంటూరులో జరిగిన గురుకుల ఉద్యోగుల ఫెడరేషన్ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొని తమ మద్దతు తెలిపారు.