చిత్తూరులో పలు ఆలయాల్లో ఆదివారం దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో ఆలయాలను సందర్శించారు. గిరింపేట దుర్గాదేవి ఆలయంలో అమ్మవారిని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ దర్శించుకున్నారు. ఉత్సవ విగ్రహాలకు అభిషేకం నిర్వహించి, హోమంలో పాల్గొన్నారు. శాంతి నగర్ వెంకటేశ్వర, కృష్ణాంజనేయ స్వామి ఆలయాలను కూడా దర్శించారు.
ఆంధ్రప్రదేశ్
దసరా ఉత్సవాలలో చిత్తూరు ఎమ్మెల్యే


