KRNL: గుండ్లకొండలో నవవధువు అరుణ(20) అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని మృతి చెందింది. తుగ్గలి మండలం లింగనాయదొడ్డికి చెందిన అరుణకు గుండ్లకొండకు చెందిన వెంకటేష్‌తో 41 రోజుల క్రితం వివాహమైంది. రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసిన ఆమె, తెల్లవారుజామున విగతజీవిగా కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
ఉరేసుకుని నవవధువు మృతి


