హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళ మృతి కేసులో లారీ డ్రైవర్ అరెస్ట్

ATP: బైక్‌ను లారీతో ఢీకొట్టి మహిళ మృతికి కారణమైన డ్రైవర్‌ను ఆత్మకూరు పోలీసులు అరెస్టు చేశారు. ఎస్‌ఐ లక్ష్మణరావు వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన ఇర్ఫాన్ ఖాన్ అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వైపు లారీలో వెళ్తుండగా ఆత్మకూరు సమీపంలో బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందింది. ప్రమాదానికి సంబంధించిన వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.