హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆదోని 'పీఠం'పై జనసేన కన్ను

KRNL: జనసేన ఆదోని నియోజకవర్గ ఇన్‌చార్జి మల్లప్ప నాయకర్‌కు రాష్ట్ర పార్టీ అధిష్టానం నుంచి విజయవాడకు రావాలని పిలుపు వచ్చినట్లు సమాచారం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరితో ఆయన భేటీ కావడంపై ఆదోనిలో రాజకీయ చర్చ జరుగుతోంది. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్‌ పదవి జనసేనకు దక్కుతుందా, మల్లప్పకు అవకాశం వస్తుందా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.