హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భారీ వర్షాలకు కొట్టుకుపోయిన రహదారి.. గ్రామస్తులకు ఇక్కట్లు

ASR: జీకేవీధి మండలం పెద్దగంగవరం-నరమామిడిగొంది మధ్య రహదారి భారీ వర్షాలకు పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో పాదచారులు, వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసర సరుకుల కొనుగోలు, అత్యవసర వైద్య సేవలు పొందేందుకు అవస్థలు పడుతున్నారు. ప్రతి వర్షాకాలంలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుండటంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.