హైదరాబాద్: 28°C
వార్తలు

వ్యాపారంలో నైతికతకు నిలువెత్తు రూపం.. టాటా!

భారత పారిశ్రామిక రంగాన్ని శిఖరాగ్రాన నిలిపిన మహోన్నత వ్యక్తి రతన్ టాటా వర్ధంతి నేడు. వ్యాపారం అంటే లాభాలు ఆర్జించడమే కాదని, సమాజ సేవ కూడా ముఖ్యమని తన జీవితం ద్వారా నిరూపించారు. టాటా గ్రూప్‌ను గ్లోబల్ బ్రాండ్‌గా మార్చడంతో పాటు, సంపాదించిన దాంట్లో సింహభాగం దాతృత్వానికే కేటాయించారు. ఆయన సాధించిన విజయాలు, పాటించిన నైతిక విలువలతో ఆదర్శనీయమైన ఆ మహానీయునికి ఘన నివాళి.