హైదరాబాద్: 28°C
వార్తలు

ప్లాస్టిక్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం

TG: హైదరాబాద్‌ బాలాపూర్‌లోని నబిల్ కాలనీలో ఉన్న ప్లాస్టిక్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గోదాంలోని పాత కెమికల్ డ్రమ్ములు ఒక్కసారిగా బగ్గుమనడంతో మంటలు తీవ్రంగా చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.