హైదరాబాద్: 28°C
వార్తలు

కోల్‌కతాలో ప్రవాసీ భారతీయ సదస్సు

19వ ప్రవాసీ భారతీయ దివస్‌ సదస్సు వచ్చే ఏడాది జనవరి 7 నుంచి 9 వరకు కోల్‌కతాలో జరగనుంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ, పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సదస్సును ప్రారంభించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ పురస్కారాలు అందజేసి ముగింపు కార్యక్రమానికి అధ్యక్షత వహించనున్నారు.